logo
సినిమా

టాలీవుడ్ నిర్మాతపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

టాలీవుడ్ నిర్మాతపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ
X
Highlights

ప్రముఖ సినీ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. చెక్‌బౌన్స్ కేసులో...

ప్రముఖ సినీ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. చెక్‌బౌన్స్ కేసులో వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు కోర్టు ఈ వారెంట్ జరీ చేసింది. రూ. 50 లక్షల లావాదేవీలకు సంబంధించిన చెక్కు బౌన్స్ కేసులో రవీందర్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకై కోర్టు పిలిచినా ర‌వీంద్ర‌రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా రవీంద్ర రెడ్డి. గౌతం మీనన్‌ దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో, బోయపాటి డైరెక్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన జయ జానకి నాయక చిత్రాలను నిర్మించారు.

Next Story