సొంత పార్టీ నేతలకు కాంగ్రెస్ ఝలక్

x
Highlights

కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలకే కాదు...సొంత పార్టీ నేతలకు కూడా ఝలక్ ఇచ్చింది. మొదటి లిస్ట్‌లో సీనియర్ నేతల పేర్లు లేకపోవడం వారిని నిరుత్సాహానికి...

కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలకే కాదు...సొంత పార్టీ నేతలకు కూడా ఝలక్ ఇచ్చింది. మొదటి లిస్ట్‌లో సీనియర్ నేతల పేర్లు లేకపోవడం వారిని నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో రెండో జాబితాలో అయినా చోటు దక్కుతుందా..లేదంటే మొత్తానికే మొండి చేయి చూపిస్తారా అనే టెన్షన్‌లో సీనియర్ నేతలు ఉన్నారు.

గతంలో బీ ఫామ్స్ ఇచ్చిన వారు ఒకరు.. ప్రస్తుత స్టార్ క్యాంపెయినర్ మరొకరు..మాజీ సీఎం కుమారుడు ఇంకొకరు..ఇలాంటి కీలక వ్యక్తులకే కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టులో సీటు దక్కలేదంటే ఎవరూ నమ్మరేమో. అవును అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్... అనేకమంది సీనియర్లకు మొండి చేయి ఇచ్చింది. సీటు గ్యారెంటీ అనుకున్న వారి పేర్లు... ఫస్ట్‌ లిస్ట్‌ కనిపించలేదు. ముఖ్యంగా 2014లో ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ గా ఉండి..అభ్యర్ధులకు బీ ఫామ్స్ ఇచ్చిన పొన్నాల లక్ష్మయ్యకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. పొన్నాల లక్ష్మయ్య జనగామ సీటును ఆశించినప్పటికీ ఈ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు. జనగామ నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం బరిలోకి దిగుతారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొన్నాల సీటు పెండింగ్‌లో పెట్టారని తెలుస్తోంది.

మెదక్ నుంచి తలపడాలని భావించిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పేరు కూడా మొదటి జాబితాలో కనిపించలేదు. అలాగేసనత్‌నగర్‌ సీటు కోరుతున్న మర్రి శశిధర్‌రెడ్డి, అంబర్‌పేట టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత వీ. హన్మంతరావు పేర్లు కూడా మొదటి జాబితాలో కనిపించలేదు. ఇక ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పి.జానార్ధన్ రెడ్డి తనయుడు విష్ణు వర్థన్ రెడ్డి పేరు కూడా పెండింగ్‌లో పడింది. అంతేకాదు జానారెడ్డి కుమారుడు ఆశిస్తున్న మిర్యాలగూడ స్థానాన్ని కూడా పెండింగ్‌ లో పెట్టారు. తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాల్సిందేనని జానారెడ్డి పట్టుబట్టారని, ఇద్దరిలో ఎవరికి కావాలో తేల్చుకోవాలని అధిష్ఠానం తేల్చిచెప్పిందని అందుకే మిర్యాలగూడ అభ్యర్థి పేరు ప్రకటించలేదని సమాచారం.

అటు మహేశ్వరం నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి టికెట్‌ ఇచ్చినా, రాజేంద్రనగర్‌ సీటు ఆశించిన ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి పేరును కూడా పెండింగ్‌లో పెట్టారు. ఇక అద్దంకి దయాకర్‌ ఆశిస్తున్న తుంగతుర్తి సీటు గండ్ర వెంకట రమణారెడ్డి ఆశిస్తున్న భూపాలపల్లి సీటును పెండింగులో పెట్టడం విశేషం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ముగ్గురు నలుగురు విద్యార్థి నేతలు సీట్లు ఆశించినా మొదటి లిస్టులో వారి పేర్లు కనిపించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories