ఆ స్కూల్‌కు సర్పంచే టీచర్

x
Highlights

అది డీ నోటిఫైడ్ ట్రైబల్ అప్పర్ ప్రైమరీ స్కూల్. బదిలీల ప్రక్రియలో భాగంగా అక్కడున్న టీచర్లు లాంగ్ స్టాండింగ్ కావడంతో వెళ్లిపోయారు. ఇక కొత్తగా రావాల్సిన...

అది డీ నోటిఫైడ్ ట్రైబల్ అప్పర్ ప్రైమరీ స్కూల్. బదిలీల ప్రక్రియలో భాగంగా అక్కడున్న టీచర్లు లాంగ్ స్టాండింగ్ కావడంతో వెళ్లిపోయారు. ఇక కొత్తగా రావాల్సిన వాళ్లు నగరాల్లో ఉన్న స్కూళ్లనే ఎంచుకున్నారు. దీంతో మారుమూల ప్రాంతంలో ఉన్న ఆ స్కూల్‌కు ఎవరూ రాకపోవడంతో గ్రామ సర్పంచ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్లే టీచర్ల అవతారమెత్తారు.

తెలంగాణలో టీచర్ల బదిలీల ప్రక్రియ మమబూబాబాద్ జిల్లాలోని ఓ స్కూల్‌కు కష్టాలను తెచ్చిపెట్టింది. కురవి మండలం స్టేషన్ గుండ్రాతి మడుగు గ్రామంలోని ట్రైబల్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌ మారుమూల ప్రాంతం కావడంతో టీచర్లు ఎవరూ రావడం లేదు. గతంలో పనిచేసిన టీచర్లు లాంగ్ స్టాండింగ్ వల్ల బదిలీ అయ్యారు. టీచర్లంతా నగరాల్లోని పాఠశాలలనే ఎంచుకుంటున్నారు. దీంతో కొత్తగా అక్కడికి ఎవరూ రావడం లేదు. దీంతో ఆ స్కూల్ విద్యార్థుల చదువు కుంటుపడుతుంది.

ఆ స్కూల్లో దాదాపు 80 మంది విద్యార్థులు చదువుతున్నా టీచర్లను నియమించేందుకు విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో చేసేది లేక సర్పంచ్ లక్ష్మీబాయి, ఎస్‌ఎంసీ చైర్మన్ కోటేశ్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. మధ్యాహ్నం భోజనాన్ని కూడా నిర్వాహకులతో వండించి విద్యార్థులు అందిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ గ్రామంలోని పాఠశాలకు టీచర్లను నియమించాలని సర్పంచ్, విద్యార్థులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories