పవన్ కల్యాణ్‌కు తెలంగాణ సర్కార్ షాక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినా లైట్ తీసుకున్న...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినా లైట్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ షోలకు నో చెప్పింది. అర్ధరాత్రి స్పెషల్ షోలు వేయొద్దంటూ థియేటర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తొక్కిసలాట జరిగే ప్రమాదముందన్న పోలీసులు భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించామన్నారు.
పవన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రీమియర్ షోలకు భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉందని, అందుకే అర్ధరాత్రి తర్వత ప్రీమియర్ షోలకు అనుమతి నిరాకరించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ షోల కోసం భ్రమరాంబ, మల్లికార్జున, ఆర్కే థియేటర్లు పోలీసులు అనుమతి కోరిన నేపథ్యంలో భద్రత కారణాల వల్ల పోలీసులు నిరాకరించారు. గతంలో కూడా ప్రీమియర్ షోలు వేసినప్పుడు పలుచోట్ల తొక్కిసలాటలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ అభిమానులు సహకరించాలని పోలీసులు కోరారు.
అయితే ఏపీ సర్కారు మాత్రం పవన్ కళ్యాణ్ ను నెత్తిన పెట్టుకుంది. పెట్టుకుంటే..తెలంగాణ సర్కారు మాత్రం చాలా లైట్ తీసుకుంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించి ఇబ్బంది పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ అడగగానే ఏకంగా 24 గంటల పాటు సినిమాల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే గతంలో బాహుబలి సినిమాకు కూడా ఇలాంటి మినహాయింపులే ఇచ్చారు. ఒక్క ఎన్టీఆర్ ను మాత్రం కావాలని వేధించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే పవన్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రీమియర్ షోలకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. అర్థరాత్రి తర్వాత ప్రీమియర్ షోలు ప్రదర్శించకూడదంటూ థియేటర్ యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
లైవ్ టీవి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
5 Dec 2019 5:10 PM GMTIndia vs West Indies : కొత్త రూల్ ఇదే
5 Dec 2019 4:23 PM GMTఉల్లి సమస్య త్వరలోనే ఒక కొలిక్కి వస్తుంది
5 Dec 2019 4:15 PM GMTక్వీన్ ట్రైలర్ : రమ్యకృష్ణపై ప్రశంసల వెల్లువ
5 Dec 2019 3:22 PM GMTముగిసిన కర్ణాటక ఉపఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్ని ఆ...
5 Dec 2019 2:48 PM GMT