కాంగ్రెస్‌ యాత్రకు హైకమాండ్‌ బ్రేక్‌...విరామం వెనుక అసలు కథ ఇదే!!

కాంగ్రెస్‌ యాత్రకు హైకమాండ్‌ బ్రేక్‌...విరామం వెనుక అసలు కథ ఇదే!!
x
Highlights

తెలంగాణలో కాంగ్రెస్‌ నేతల పాదయాత్రలకు బ్రేక్ పడింది. ముఖ్యనేతలంతా పాదయాత్రలు చేయడానికి క్యూ కట్టడంతో.. హైకమాండ్ రెడ్ సిగ్నల్ వేసింది. నాయకుల పాదయాత్రల...

తెలంగాణలో కాంగ్రెస్‌ నేతల పాదయాత్రలకు బ్రేక్ పడింది. ముఖ్యనేతలంతా పాదయాత్రలు చేయడానికి క్యూ కట్టడంతో.. హైకమాండ్ రెడ్ సిగ్నల్ వేసింది. నాయకుల పాదయాత్రల వల్ల పార్టీలో కొత్త వివాదాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయంతో పాదయాత్ర చేద్దామనుకున్న నేతలంతా డిజప్పాయింట్ అయ్యారు.

పాదయాత్రలతో తెలంగాణ చుట్టి రావాలనుకున్న కాంగ్రెస్ నాయకులకు నిరాశే ఎదురైంది. వర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్ర‌మార్క, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని భావించారు. వీరిలో ముగ్గురికి ఏఐసీసీ పర్మిషన్ కూడా ఇచ్చింది. మే రెండో వారం నుంచి వారి వారి జిల్లాల నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రలు చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. కానీ ఇంతలోనే హైకమాండ్ మళ్లీ రెడ్ సిగ్నల్ వేసిది.

ఇప్పటికే ప్రజాచైతన్య యాత్ర పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్లు, నేతలంతా పాల్గొన్నారని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అధిష్టానానికి పీసీసీ నివేదించింది. సో ఇలాంటి టైంలో మళ్లీ ముఖ్య నేతలు పాదయాత్ర చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని హైకమాండ్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే రాహుల్ గాంధీ ఎవరూ పాదయాత్రలు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో పాదయాత్ర మొదలుపెట్టేందుకు రెడీ అయిన నేతలంతా నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక వేళ పాదయాత్రలు చేయాలనుకుంటే నేతలంతా కలిసి పాదయాత్ర చేయాలని హైకమాండ్ ఆప్షన్ ఇచ్చింది. దీంతో ఇది కుదరని వ్యవహారమని డిసైడ్ అయ్యారు. అందుకే పాదయాత్రల నుంచి వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నారట. ఇక రేవంత్ రెడ్డి మాత్రం తాను పాదయాత్ర చేస్తానని ఎప్పుడూ చెప్పలేదని ఇప్పుడు అధిష్టానం తనను వద్దని చెప్పినట్లు ప్రచారం చేయొద్దని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ నేతలంతా పాదయాత్రలకు రెడీగా ఉన్న టైంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఎవరికీ మింగుడుపడటం లేదని గాంధీభవన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories