ఎంపీపీపై అవిశ్వాసం పెట్టిన చొప్పదండి ఎంపీటీసీలకు వేధింపులు

x
Highlights

కరీంనగర్ జిల్లా చొప్పదండి రాజకీయాలు వేడెక్కాయి. ఎంపీపీ భూంరెడ్డిపై ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అవిశ్వాసం పెట్టిన 11...

కరీంనగర్ జిల్లా చొప్పదండి రాజకీయాలు వేడెక్కాయి. ఎంపీపీ భూంరెడ్డిపై ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అవిశ్వాసం పెట్టిన 11 మంది ఎంపీటీసీలపై ఎంపిపి భూంరెడ్డిపై బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీపీ బెదిరింపులు తాళలేక ఎంపీటీసీలంతా కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. చిట్యాలపల్లి ఎంపీటీసీ మంగ భర్త హైదరాబాద్ లో ఉన్న ఎంపీటీసీలపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ వచ్చిన పోలీసులు చొప్పదండి ఎంపిటీసీ ఎలిగేటి తిరుపతి, మునిగాల చందు,తో పాటు కొత్త జయపాల్ రెడ్డి ని అదుపులోకి తీసుకుని పోలీస్ కొత్తపల్లి స్టేషన్ కు తరలించారు. ఎంపీటీసీలను అరెస్ట్ చేయలేదని విచారణకు మాత్రమే తీసుకువచ్చామని పోలీసులు చెబుతున్నారు. తాము పెట్టిన అవిశ్వాసం విగిపోయేలా ఎంపీపీ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఇష్టానుసారంగా వ్యవహరించడంతో పాటు అసత్యప్రచారాలు చేస్తున్నారని వాపోయారు. మహిళా ఎంపీటీలమన్న కనీసం గౌరవం కూడా తమకు ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ పట్ల దౌర్జన్యం చేయడంతో లేనిపోని కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. ఎంపిపి తీరుపై ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పిన ఎంపీటీసీలు ఈనెల 16 తేది వరకు ఎంపీపీ ఆఫీస్ లో అడుగుపెట్టే వరకు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories