కేంద్రంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం

కేంద్రంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం
x
Highlights

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ దూకుడు పెంచింది. ఇవాళ కేంద్రంపై లోక్‌సభలో వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్...

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ దూకుడు పెంచింది. ఇవాళ కేంద్రంపై లోక్‌సభలో వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభ సెక్రటరీ జనరల్ కు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చారు. తమ పార్టీ లోక్ సభ సభ్యులంతా ఇవాళ సభకు తప్పనిసరిగా హాజురుకావాలంటూ.. విప్‌ జారీ చేశారు వైవీ సుబ్బారెడ్డి. అవిశ్వాస తీర్మానం సమయంలో లేచి నిలబడి మద్దతివ్వాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతు ఇవ్వాలని తెలిపింది. అసెంబ్లీలో మంత్రులతో సమావేశమైన అనంతరం.. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఇచ్చే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని చంద్రాబు నిర్ణయించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు పోరాడిన మద్దతు ఉంటుందని.. దానిలో భాగంగానే వైసీపీ మద్దతు ఇస్తున్నట్టు బాబు తెలిపారు. రాజకీయాలు ముఖ్యం కాదని.. కేంద్రంపై ఒత్తిడి తేవడమే ముఖ్యమని చెప్పారు.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉండటంతో.. ఈ నెల 21న ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానాన్ని, ఇవాళే పెట్టాలని వైసీపీ నిర్ణయించింది. వైసీపీ అవిశ్వాసానికి మద్దతునివ్వాలని.. ఆ పార్టీ అధినేత జగన్‌ పలు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు లేఖలు రాశారు.

ఏపీ నుంచి ఉన్న మొత్తం 25 మంది లోక్‌సభ సభ్యులు ఉంటే.. వారిలో వైసీపీకి ఐదుగురు ఎంపీలున్నారు. టీడీపీకి 17 మంది సభ్యులున్నారు. బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అరకు ఎంపీ గీత తటస్థంగా ఉంటున్నారు. మరోవైపు, అవిశ్వాసానికి అవసరమైన ఎంపీల మద్దతును కూడగడతానన్న జనసేన అధినేత పవన్.. ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని వైసీపీ విమర్శిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories