మాజీ ముఖ్యమంత్రిని కలిసిన బొత్స, ఆనం

nanireddy
Updated on: 24 Dec 2018 4:07 PM IST
మాజీ ముఖ్యమంత్రిని కలిసిన బొత్స, ఆనం
X

అంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం మధ్యాహ్నం వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి కలిశారు. దాదాపు గంటపాటుగా ఆయనతో భేటీ అయిన వీరు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. అయితే బొత్స సత్యనారాయణ మాత్రం తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని.. కేవలం మర్యాదపూర్వకంగానే కలిసినట్టు వెల్లడించారు. కాగా బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో టీడీపీది అపవిత్ర కలయిక అని బొత్స అభివర్ణించారు. చంద్రబాబు దోపిడీపై రాష్ట కాంగ్రెస్‌ పార్టీ గత జూన్‌ 8న చార్జీషీటు విడుదల చేసిందని.. ఈ విషయం ఆ పార్టీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. ఎవరితోనూ పొత్తులుండవని బొత్స స్పష్టం చేశారు.

nanireddy

nanireddy

Next Story