మంత్రి పదవులు దక్కేది వీరికేనా?

nanireddy
Updated on: 24 Dec 2018 3:55 PM IST
మంత్రి పదవులు దక్కేది వీరికేనా?
X

రేపు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరగనుంది. మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీ వర్గానికి చెందిన శాసన మండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూఖ్‌కు చోటు దక్కినట్లు సమాచారం. ఫరూఖ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు గతంలోనే నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. రేపు అమరావతికి రావాలని ఫరూఖ్‌కు సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయనకు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు సన్మానించి అభినందనలు తెలిపారు. మంత్రి వర్గంలో చోటు ఖాయం అన్న సంకేతాలతో ఫరూఖ్‌ వర్గీయులు బాణసంచా కాల్చి పండగ చేసుకున్నారు. మరోవైపు ఎస్టీ కోటనుంచి మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కిడారి సర్వేశ్వరరావు తనయుడు కిడారి శ్రవణ్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు సమాచారం.

nanireddy

nanireddy

Next Story