నిజాం మ్యూజియం చోరీ కేసును చేధించిన పోలీసులు

నిజాం మ్యూజియం చోరీ కేసును చేధించిన పోలీసులు
x
Highlights

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజాం మ్యూజియంలో చోరీ కేసును పోలీసులు చేధించారు. కర్ణాటకలోని గుల్బర్గాలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు...

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజాం మ్యూజియంలో చోరీ కేసును పోలీసులు చేధించారు. కర్ణాటకలోని గుల్బర్గాలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వీరి నుంచి బంగారు టిఫిన్ బాక్స్ తో పాటు ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 3న రాత్రి నిజాం మ్యూజియంలో చోరికి పాల్పడిన దుండగులు బంగారు టిఫిన్ బాక్స్ తో పాటు పలు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం అడుగడుగునా పరిశీలించిన పలు కీలక ఆధారాలను సేకరించారు. ఈ ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. గుల్బర్గాలో ఉన్న నిందితులను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి విలువైన బంగారపు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

సంచలనంగా మారిన నిజాం మ్యూజియం చోరీ కేసులో ఇంటి దొంగల ప్రమేయముందని మొదట పోలీసులు భావించారు. విలువైన, అరుదైన, ప్రాచీన ఆభరణాలు ఉన్నా మ్యూజియం నిర్వాహణ, భద్రత విషయంలో మాత్రం అడుగడుగునా డొల్లతనమే కనిపిస్తోంది. దీంతో భద్రతా లోపంతోనే ఈ చోరీ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దోపిడికి ముందు రెక్కి నిర్వహించిన నిందితులు రెండు రోజుల ముందు సందర్శకుల తరహాలో మ్యూజియంలోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ తో పాటు మరికొన్ని కీలక ఆధారాలు లభించడంతో నిజాం మ్యూజియం కేసును పోలీసులు వారం రోజుల్లో చేధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories