రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికల్లో మరో ట్విస్ట్‌

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికల్లో మరో ట్విస్ట్‌
x
Highlights

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికల్లో బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ స్పీడు పెంచారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మద్ధతు కోరుతున్నారు. తెలంగాణ సీఎం...

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికల్లో బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ స్పీడు పెంచారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మద్ధతు కోరుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసిన నితీష్‌కుమార్‌..జేడీయూ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ నితీష్‌ కోరారు. రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ అభ్యర్థిగా జేడీయూ తరుపున హరివంశ్‌నారాయణ్‌సింగ్‌ పోటీ చేస్తున్నారు. దీనికి స్పందించిన కేసీఆర్‌ పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరుగునున్న విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్ధిగా జేడీయూకి చెందిన హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ను బీజేపీ ప్రాతిపాధించిన విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్ధిని ఓడించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రయత్నాలను ముమ్మరం​ చేసింది. మిత్రపక్షాల్లో ఎవరు అభ్యర్థిని నిలబెట్టినా మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పీజే కురియన్‌ పదవీకాలం​ జూన్‌ 1న ముగిసిపోవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories