కేసీఆర్‌ వ్యాఖ్యల గురించి కేటీఆర్‌ను నిలదీశాను: సీతారామన్‌

కేసీఆర్‌ వ్యాఖ్యల గురించి కేటీఆర్‌ను నిలదీశాను: సీతారామన్‌
x
Highlights

కేసీఆర్ కామెంట్స్ వర్సెస్ బీజేపీ ఇప్పుడిదే తెలంగాణలో ట్రెండింగ్. ప్రధాని మోడీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు గల్లీ పరిధి దాటి ఇప్పుడు ఢిల్లీ ఇష్యూగా...

కేసీఆర్ కామెంట్స్ వర్సెస్ బీజేపీ ఇప్పుడిదే తెలంగాణలో ట్రెండింగ్. ప్రధాని మోడీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు గల్లీ పరిధి దాటి ఇప్పుడు ఢిల్లీ ఇష్యూగా మారింది. స్టేట్ బీజేపీయే కాదు కేంద్రం కూడా సీరియస్‌గా తీసుకుంది. టాటా బోయింగ్ కంపెనీ ప్రారంభానికి హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేసీఆర్ కామెంట్స్‌పై కేటీఆర్‌ను నిలదీశారంటేనే ఇష్యూ ఎంత సీరియస్‌గా మారిందో అర్థమవుతోంది.

ప్రధాని మోడీని కేసీఆర్ ఏకవచనంతో అనడంపైనే ఇప్పుడు దుమారం రేగుతోంది. రైతు సమన్వయ సమితి సభలో కేసీఆర్ స్పీచ్ ఇరగదీస్తున్న టైంలో ప్రసంగం కాస్తా ప్రధాని మీదకు మళ్లింది. అప్పుడు ఆవేశంలో అలా అన్నారో లేక అనాలనే అన్నారో అసలు సీఎం ఏ సిచ్యువేషన్ లో అన్నారో తెలియదు గానీ ఆ ఒక్క పదం ఇప్పుడు బీజేపీని రగిలిస్తోంది. దేశ ప్రధానిని ఒక ముఖ్యమంత్రి ఏకవచనంతో సంభోదించడమేంటని ప్రశ్నిస్తోంది.

కేసీఆర్ కామెంట్స్‌పై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు. ప్రధాని పట్ల కేసీఆర్‌ వాడిన భాష తనకు నచ్చలేదన్నారు. రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ వ్యాఖ్యల పట్ల జాగ్రతగా ఉండాలని సూచించారు. టాటా బోయింగ్‌ కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చిన నిర్మాలాసీతారామన్‌ కేసీఆర్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ను నిలదీసినట్లు చెప్పారు.

బీజేపీ-టీఆర్ఎస్‌ మధ్య సైద్ధాంతికపరమైన వైరుధ్యాలు ఉండొచ్చు కానీ ప్రధానిని ఏకవచనంతో ఎలా సంబోధిస్తారని కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. తన తండ్రి అలా మాట్లాడతారని అనుకోలేదని కేటీఆర్‌ వివరణ ఇచ్చాకే టాటా బోయింగ్‌ కంపెనీ ప్రారంభోత్సవానికి తాను హాజరైనట్లు చెప్పారు నిర్మలా సీతారామన్. అంతేకాదు సభా వేదికపైన కూడా కేటీఆర్‌ను నిలదీసినట్లు చెప్పారు.

ప్రధాని మోడీ పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయన్నారు నిర్మలా సీతారామన్. తన వ్యాఖ్యలపై కేసీఆర్ వివరణ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. ఏదేమైనా ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు, నిర్మలా సీతారామన్ కౌంటర్ తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories