నిర్మల్‌ జిల్లాలో దారుణం..పదేళ్ల బాలిక కిడ్నాప్‌, హత్యాచారం

నిర్మల్‌ జిల్లాలో దారుణం..పదేళ్ల బాలిక కిడ్నాప్‌, హత్యాచారం
x
Highlights

పదేళ్ల చిన్నారి అత్యాచారం, హ‌త్యపై ఊరు ఊరంతా ఒక్కటైంది.. జరిగిన దారుణాన్ని సహించలేక.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. నిందితుడిని నడిరోడ్డుపై...

పదేళ్ల చిన్నారి అత్యాచారం, హ‌త్యపై ఊరు ఊరంతా ఒక్కటైంది.. జరిగిన దారుణాన్ని సహించలేక.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. నిందితుడిని నడిరోడ్డుపై చంపేయ్యాల్సిందే అంటూ.. నినదించింది. మరోసారి మరొకరు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టకుండా బుద్దిచెప్పాల్సిందే అంటూ.. నిరసన చేపట్టింది. నిర్మల్ జిల్లా సోన్‌ మండలం కూచనపల్లి గ్రామం.. ఆందోళనలతో అట్టుడుకింది.

నిర్మల్ జిల్లా సోన్ మండలం.. కూచనపల్లి శివారులో పదేళ్ల బాలికను అత్యంత దారుణంగా చంపిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలంటూ.. గ్రామస్థులు చేపట్టిన ఆందోళనలు.. ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేయడంతో పాటు.. ప్రాణాలు తీశాడు. తర్వాత గోదావరి ఒడ్డున నిర్మాణుష్య ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని దాచిపెట్టాడు. బాలిక డెడ్‌ బాడీని కనుగొన్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే జరిగిన ఘటనపై రక్తం మరిగిన గ్రామస్థులు.. కామాంధులను కఠినంగా శిక్షించాలంటూ ఏకమయ్యారు. 44 వ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతకుముందు ఊరంతా కలిసి.. సోన్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించింది. స్టేషన్ ముందే కూర్చొని.. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ గ్రామస్తులు చేశారు. అమ్మాయిల రక్షణకు ఎన్నిచట్టాలు తీసుకొస్తున్నా.. వారి ప్రాణాలకు భరోసా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని సోన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ కేసులో మరో మైనర్ బాలుడికి కూడా సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు సకాలంలో స్పందించలేదన్న అరోపణల్ని ఎఎస్పీ దక్షిణామూర్తి ఖండించారు. పోస్ట్ మార్టం నివేదిక రాగానే నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్నారులపై పైశాచిక దాడులకు పాల్పడుతున్న ఇలాంటి దుర్మార్గులు.. సమాజంలో ఉండటానికి వీళ్లేదంటున్నారు.. కూచనపల్లి గ్రామస్తులు. నిందితులకు ఉరిశిక్ష పడే వరకు తమ ఆందోళనలు ఆగబోవని.. స్పష్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories