బ్రాహ్మణపల్లి ఘ‌ట‌న‌లో కొత్త‌ట్విస్ట్

బ్రాహ్మణపల్లి ఘ‌ట‌న‌లో కొత్త‌ట్విస్ట్
x
Highlights

మెదక్ జిల్లాలో బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొత్త ట్విస్ట్. కూతుర్ని ప్లాట్‌ఫామ్‌పై వుంచి రైలు కింద...

మెదక్ జిల్లాలో బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొత్త ట్విస్ట్. కూతుర్ని ప్లాట్‌ఫామ్‌పై వుంచి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు దంపతులు. తాజాగా ఈ కేసులో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. చనిపోయింది భార్యాభర్తలు కాదని, బావామరదళ్లని తేలింది. కామారెడ్డి రైల్వే ఎస్సై తావునాయక్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డిలోని పద్మాజివాడకు చెందిన ఒంటెద్దు కాశీరాం(35) వరుసకు మరదలైన దేవేంద్ర(30)తో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దేవేంద్ర భర్త రఘు ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. వీరికి 5 ఏళ్ల బాబు, ఏడాది పాప ఉంది. కాశీరాంకు కూడా గతంలోనే పెళ్లి జరి గింది. కుటుంబ తగాదాల కారణంగా భార్య తో విడాకులు తీసుకున్నాడు. ఈ సమయంలో ఒంటరిగా ఉంటున్న దేవేంద్రతో సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకు న్నాయి. కులపెద్దలు పంచాయితీ నిర్వహించి కాశీరాంకు రూ.3 లక్షల వరకు జరిమానా విధించారు. ఈ విషయం దుబాయ్‌లో ఉన్న రఘుకు తెలియంతో భార్య తనకు వద్దని కులపెద్దలతో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కాశీరాం, దేవేంద్ర బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్‌లో రాత్రి రైలు దిగిన వారు తమ వెంట ఉన్న దేవేంద్ర కూతురును స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై వదిలిపెట్టి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరోవైపు తమ ఆత్మహత్యకు దేవేంద్ర తల్లిదండ్రులు, బంధువులే కారణమని వారి వేధింపులతోనే చనిపోతున్నామంటూ కాశీరామ్‌ ఫేస్‌బుక్‌లో సీఎంకి లేఖ రాశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories