ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జునరెడ్డి ఉదంతంలో కొత్త ట్విస్ట్‌

ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జునరెడ్డి ఉదంతంలో కొత్త ట్విస్ట్‌
x
Highlights

వివాహేతర సంబంధం కారణంగా సస్పెండ్ అయిన ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జునరెడ్డి ఉదంతంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సునీతా రెడ్డిని తాను ఓ...

వివాహేతర సంబంధం కారణంగా సస్పెండ్ అయిన ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జునరెడ్డి ఉదంతంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సునీతా రెడ్డిని తాను ఓ రోల్ మోడల్ లా చూశానని... ఆమె ప్రవర్తనతో తాను మనస్తాపానికి గురయ్యానని ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. సునీతా రెడ్డే ఇలాంటి పని చేయడంతో, తనకు ఆత్మహత్యే శరణ్యమని వినయ్ అనే అభిమాని సూసైడ్ నోట్ విడుదల చేశాడు. ఎంతో మందికి ఆదర్శవంతంగా ఉండేవారు... నీతివంతమైన జీవితం గడపాలని, నైతిక విలువలను పాటించాలని లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో... వారు వినయ్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories