యాంకర్‌ ఆత్మహత్య కేసులో మలుపు

యాంకర్‌ ఆత్మహత్య కేసులో మలుపు
x
Highlights

టీవీ యాంకర్ తేజస్విని 16వ తేదీ రాత్రి విజయవాడ సమీపంలోని కంకిపాడులో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆరోజు అత్తతో ఆమె గొడవ పడిందని... ఆ తర్వాత...

టీవీ యాంకర్ తేజస్విని 16వ తేదీ రాత్రి విజయవాడ సమీపంలోని కంకిపాడులో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆరోజు అత్తతో ఆమె గొడవ పడిందని... ఆ తర్వాత గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకుందని ఇంత వరకు తెలిసిన విషయం. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు."పవన్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నమ్మి వచ్చినందుకు నన్ను వేధించాడు. ఇబ్బందులు పెడుతున్నాడు. నాకన్నా స్నేహితులే అతనికి ఎక్కువయ్యారు. నన్ను పట్టించుకోవడం లేదు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నా" అంటూ సూసైడ్ నోట్ లో తేజస్విని పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.

మృతురాలి తల్లి మంగళగిరి వెంకటరమణమ్మ తన కుమార్తెను ఐదేళ్ల కిందట పవన్‌కుమార్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఆత్మహత్యకు గల కారణాలు తెలీదని, విచారించాలని అదేరోజు రాత్రి ఫిర్యాదులో పేర్కొంది. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఫేస్‌బుక్, ఈమెయిల్స్‌ను ఆమె ల్యాప్‌టాప్‌లో పరిశీలించారు. ‘ప్రేమించి, నమ్మి వచ్చినందుకు వేధించాడని, ఇబ్బందులు పెడుతున్నాడని, స్నేహితులే ఎక్కువ అయ్యారని, తనను పట్టించుకోవటం లేదని, ప్రవర్తన సరిగా లేదని అందుకే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు’ సూసైడ్‌ నోట్‌లో తేజస్విని పేర్కొన్నట్లు సమాచారం. విజయవాడ ఈస్ట్‌ జోన్‌ ఏసీపీ విజయభాస్కర్‌ సోమవారం స్థానిక పోలీసుస్టేషన్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. ఈడుపుగల్లులోని ఘటనాస్థలానికి వెళ్లి విచారణ జరిపారు.
తేజస్విని భర్త పవన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం వరకూ మృతురాలి కుటుంబ సభ్యులు, పవన్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో పోలీసుస్టేషన్‌ వద్ద రాజీ మంతనాలు జరిగినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories