ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష
x
Highlights

ఇటీవల కాలంలో న‌గ‌ర‌ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యం.. అజాగ్రత్త.. రూల్స్ ను ఫాలోకాకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఏ మాత్రం...

ఇటీవల కాలంలో న‌గ‌ర‌ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యం.. అజాగ్రత్త.. రూల్స్ ను ఫాలోకాకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఏ మాత్రం ఉపేక్షించటం లేదు. ప్రమాదానికి కారణమైన ఏ అంశంలోనూ రాజీ లేకుండా కేసులు నమోదు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం ఒక తప్పు అయితే.. మైనర్లు బండ్లు నడపడం ప్రమాదకరం. దీనిపై దృష్టి సారించిన పోలీసులు.. కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విషయంలో కోర్టు సైతం ఒక రోజు జైలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇప్ప‌టికే మైన‌ర్లు డ్రైవింగ్ చేసి కొన్ని ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కొన్ని క‌ఠిన‌మైన శిక్ష‌లు విధిస్తున్నారు. అంతేకాదు మైనర్ల‌కు ఎవ‌రు టూవీల‌ర్లు ఇచ్చినా వారిని కూడా ఒక‌రోజు జైల్లో వేసేలా హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాబ‌ట్టి మైనర్లు - వారి త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త వ్య‌వ‌హరించాల‌ని సూచించింది.
దీంతో పాటు ఎవ‌రైనా ఇయ‌ర్ ఫోన్లు పెట్టొకొని డ్రైవింగ్ చేస్తున్నా, హెల్మెట్ ఉన్నా ఇయ‌ర్ ఫోన్ ను వినియోగించినా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, హెల్మెట్ పెట్టుకున్నా కూడా అలాంటి వారికి శిక్ష‌లు విధించేందుకు వెనుకాడ‌డంలేదు. లైసెన్స్ లేకుండా పిల్లలకు బండ్లు ఇచ్చే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు.. అనంతరం వారిని కోర్టుకు హాజరుపర్చారు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ ఒక రోజు సాధారణ జైలును విధిస్తూ తీర్పును ఇచ్చారు. ఫలక్ నుమా పరిధిలోని పేరెంట్స్ కు ఈ తరహా శిక్ష విధించినట్లుగా చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories