సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు కొత్త మెనూ

x
Highlights

మూడు రోజుల కోడికూర, రోజుకో అల్పాహారం, రోజూ పాలు, అరటి పండు...ఇది ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో మెనూ. హస్టళ్లలో చదువుకునే విద్యార్థుల కోసం...

మూడు రోజుల కోడికూర, రోజుకో అల్పాహారం, రోజూ పాలు, అరటి పండు...ఇది ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో మెనూ. హస్టళ్లలో చదువుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం కొత్త ఆహార పట్టికను రెడీ చేసింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర లభిస్తే...ఈ ఏడాది కొత్త మెనూ అమలు కానుంది.

సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు కొత్త మెనూ ప్రవేశ పెట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వారంలో మూడు రోజులు కోడికూర, రోజుకో రకం అల్పాహారం, ప్రతిరోజూ పాలు, అరటిపండు ఇవ్వనున్నారు. అంతేకాకుండా పాఠశాలకు వెళ్లే ముందు వేరుశెనగ ఉండలు, తిరిగొచ్చాక రాగిజావ, మాంసాహారం లేని రోజు ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాలని ప్రతిపాదనలు రెడీ చేశారు.

7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.750 నుంచి రూ.1,000, 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.850 నుంచి రూ.1,250, ఇంటర్‌ ఆపై చదివే విద్యార్థులకు నెలకు రూ.1,050 నుంచి రూ.1,400లు పెంచింది సర్కార్‌. పెంచిన వాటికి అనుగుణంగా వసతి గృహాల్లోని విద్యార్థులకు మంచి పోషకాహారం అందించాలన్న ఉద్దేశంతో ఆహార పట్టికను రెడీ చేశారు.

రాత్రి ఆకుకూర పప్పు, కూరగాయల కూరతో భోజనం, ఆదివారం మధ్యాహ్నం, మంగళవారం, శుక్రవారం రాత్రి కోడికూర, మాంసాహారం లేని రోజు ఉడకబెట్టిన గుడ్డు, కళాశాల వసతిగృహాల్లోని విద్యార్థులకు ఉదయం, రాత్రి అరటిపండు అందించనున్నారు. ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను ఆమోదిస్తే...ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories