సీఎం కేసీఆర్ కోసం మరో ఖరీదైన బస్సు..ఎందుకంటే..

x
Highlights

మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణా, చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్...

మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణా, చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తర్వాత సీఎంకు భద్రత కట్టుదిట్టం చేయాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. దీంతో సీఎం పర్యటనల కోసం కొత్తగా మరో బుల్లెట్‌ప్రూఫ్ బస్సు సిద్ధం చేస్తున్నారు.

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ భద్రతా కాన్వాయ్‌లో మరో అత్యాధునిక వాహనం చేరబోతోంది. తెలంగాణా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తమైన ఇంటలిజెన్స్ వర్గాలు సీఎం భద్రతపై సమీక్షించాయి. వచ్చేది ఎన్నికల ఏడాది కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్తృతంగా జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది. దీంతో ఆయనకి భద్రత పెంచాల్సిన ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి తెలిపాయి.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టుల కదలికలు అంతగా లేవు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో దాడులు పెరగడంతో మావోయిస్టులు తెలంగాణాలోకి చొచ్చుకొస్తున్నారని మొన్నటి ఎన్‌కౌంటర్‌తో తేలింది. ఎన్‌కౌంటర్లో మావోయిస్టు ముఖ్యనేతలు తప్పించుకున్నప్పటికీ భారీ నష్టమే జరగడంతో మావోయిస్టు పార్టీ ఆగ్రహంగా ఉంది. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తామని ప్రకటించింది.

మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పర్యటనల సమయంలో సీఎం కేసీఆర్‌కు భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్ సూచించింది. అత్యాధునికమైన మరో బుల్లెట్‌ప్రూఫ్ బస్సు అవసరమని తెలిపింది. అందుకే బుల్లెట్ ప్రూఫ్‌తో పాటు, ల్యాండ్ మైన్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త బస్సు కొనుగోలుకు ప్రభుత్వం ఎనిమిది సభ్యులతో కమిటీని నియమించింది.

కొత్త బస్సుకు 7 కోట్లు ఖర్చవుతాయని అంచనా. దీనికి అవసరమైన బడ్జెట్ కోసం శాఖాపరంగా అనుమతిచ్చారు. బస్సులో ఉండాల్సిన భద్రతా వసతులను కమిటీ ఖరారు చేసి టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. టెండర్లు ఖరారైన రెండు మూడు నెలల్లోగా బస్సును తయారు చేసి అప్పగిస్తారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories