కొత్త వంద నోట్లు వచ్చేస్తున్నాయ్‌

కొత్త వంద నోట్లు వచ్చేస్తున్నాయ్‌
x
Highlights

వంద నోట్లు చిరిగిపోయాయి.. కొత్తవి ముద్రించాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు బ్యాంకర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు సమయంలో...

వంద నోట్లు చిరిగిపోయాయి.. కొత్తవి ముద్రించాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు బ్యాంకర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ కష్టాల నుంచి అటు బ్యాంకర్లను, ఇటు ఖాతాదారులను గట్టెక్కించినవి ఈ వంద నోట్లే. 2016, నవంబర్ 8వ తేది రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. వీటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2,000 నోట్లను పరిచయం చేస్తున్నామనీ తెలిపారు. అయితే ఈ కొత్త నోట్లు డిమాండ్‌కు సరిపడా లేకపోవడంతో అప్పటిదాకా ఉన్న రూ.100 నోట్లకుతోడు.. ఆర్బీఐ వద్దనున్న పాత నోట్లనూ చలామణిలోకి తేవాల్సి వచ్చింది. పాత నోట్లతో పోల్చితే కొత్త నోట్ల పరిమాణంలో తేడాలుండటంతో ఏటీఎంలలో కేవలం రూ.100 నోట్లనే పెట్టాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే 2005కు ముందు నోట్లూ వాడుకలోకి వచ్చాయి. కొత్త రూ.500 నోట్ల సరఫరా అంతగా లేకపోవడంతో రూ.2,000 నోట్ల మార్పిడికి ఉన్న ఏకైక ఆధారం రూ.100 నోటే. దీంతో వీటికి పెద్ద ఎత్తున డిమాండ్ కనిపించింది. దీంతో బ్యాంకులు 5,500 మిలియన్ల రూ.100 నోట్లు కావాలని ఆర్బీఐకి వినతి చేశాయి. అయితే పరిస్థితి తీవ్రత దృష్ట్యా 5,738 మిలియన్ల నోట్లను ద్రవ్యవ్యవస్థలోకి ఆర్బీఐ ప్రవేశపెట్టింది. ఇందులో కొత్తవి, పాతవి ఉన్నాయి. పాతవే ఎక్కువగా ఉండగా, ఇప్పుడు ఆ నోట్లన్నీ చిరుగులు పడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories