Top
logo

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత
X
Highlights

ప్రపంచ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గతకొద్ది కాలంగా శ్వాసకోస సంబంధిత...

ప్రపంచ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గతకొద్ది కాలంగా శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1932 డిసెంబర్‌ 28న వరంగల్‌ జిల్లా మట్టెవాడలో జన్మించిన వేణుమాధవ్ మిమిక్రీ రంగంలో తన సొంత ఒరవడితో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సైతం వేణుమాధవ్‌ పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న నేరెళ్ల మూడు యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్‌ పొందారు.

Next Story