సొంత ఒరవడితో మిమిక్రీ రంగంలో ప్రత్యేక గుర్తింపు

సొంత ఒరవడితో మిమిక్రీ రంగంలో ప్రత్యేక గుర్తింపు
x
Highlights

నేరెళ్ల వేణుమాధవ్‌ 1932 డిసెంబర్ 28న వరంగల్‌ జిల్లాలో జన్మించారు. సెలబ్రెటీలు, ప్రముఖుల వాయిస్‌లను ఇమిటేట్‌ చేయడంలో నేరెళ్ల దిట్ట. వేణుమాధవ్‌కు...

నేరెళ్ల వేణుమాధవ్‌ 1932 డిసెంబర్ 28న వరంగల్‌ జిల్లాలో జన్మించారు. సెలబ్రెటీలు, ప్రముఖుల వాయిస్‌లను ఇమిటేట్‌ చేయడంలో నేరెళ్ల దిట్ట. వేణుమాధవ్‌కు ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ మిమిక్రీ కళాకారులు పిలుచుకుంటారు. 1947లో 16 ఏళ్ల వయసులో కెరీర్‌ను ప్రారంభించారు నేరెళ్ల వేణు మాధవ్‌. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, ఉర్దూ, తమిళలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చి నేరెళ్ల రికార్డు సృష్టించారు. పొట్టి శ్రీరాములు యూనివర్శిటీలో మిమిక్రీ కోర్సు చేశారు. మిమిక్రీ కోర్సులో డిప్లొమా చేసిన తొలి వ్యక్తి నేరెళ్ల వేణుమాధవ్‌.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1972 నుంచి 78 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. ఆ తర్వాత 1976 నుంచి 77 వరకు ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా పని చేశారు. సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా, సౌత్‌ జోన్‌ కల్చరల్ కమిటీ, దూరదర్శన్‌ ప్రొగ్రాం అడ్వయిజరీ కమిటీ, టెలికాం అడ్వయిజరీ కమిటీ, రైల్వే జోనల్ యూజర్స్‌ కమిటీ, ఎపీ లెజిస్లేటివ్‌ లైబ్రరీ కమిటీలకు సభ్యుడిగా పనిచేశారు. రవీంద్రభారతి కమిటీ, ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీల్లోనూ పని చేశారు.

2001లో నేరెళ్ల వేణుమాధవ్‌కు పద్మశ్రీ పురస్కారం...కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 1981లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ బహుమతిని అందుకున్నారు. ఆంధ్రా యూనివర్శిటీ కళా ప్రపూర్ణతో, జేఎన్‌టీయూ, కాకతీయ యూనివర్శిటీలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయ్. మిమిక్రీ సామ్రాట్‌, చూపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళా సరస్వతి, స్వర్‌ కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ అన్న బిరుదులు వరించాయ్.

మాజీ రాష్ట్రపతులు నీలం సంజీవరెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి, జ్ఞానీ జైల్ సింగ్, ఫక్రుద్దీన్‌ అలీ, మాజీ ప్రధాన మంత్రులు లాల్ బహుదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ, పీవీ నరసింహరావులు...నేరెళ్ల వేణు మాధవ్‌ ప్రదర్శనలు తిలకించి ప్రశంసలు కురిపించారు. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు, గవర్నర్లు నేరెళ్ల వేణుమాధవ్ షోలను తిలకించారు.

నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్‌ను స్థాపించి... ప్రతియేటా తన పుట్టిన రోజున ప్రముఖ కళాకారులను నగదు పురస్కారంతో సత్కరిస్తున్నారు. డా.కాశీభట్ల విశ్వనాథం, ఎస్.కె.గౌడ్, కవిశాబ్దిక కేసరి నల్లాన్ చక్రవర్తుల రఘునాధాచార్య, జమ్మలమడక కృష్ణమూర్తి, ఉల్లి రామచంద్రయ్య, తిరుమలశెట్టి సీతాలత, బాలీవుడ్ కమెడియన్‌ జానీలీవర్‌లను సన్మానించారు. అంతేకాకుండా కోవెల సుప్రసన్నా చార్య, వి.హరికిషన్, చుక్కా సత్తయ్య వంటి వారిని కల్చరల్ ట్రస్ట్ ద్వారా సన్మానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories