నేను సైతం!

నేను సైతం!
x
Highlights

కొన్ని పాటలు మనని ఎంతో ఆలోచింపచేస్తాయి... ముఖ్యంగా శ్రీ.శ్రీ పాటలు...అయితే..అలాంటి పాటే ఈ నేను సైతం ప్రపంచాగ్నికి అనే తెలుగు సినిమా పాట. ఈ పాట ఠాగూర్...

కొన్ని పాటలు మనని ఎంతో ఆలోచింపచేస్తాయి... ముఖ్యంగా శ్రీ.శ్రీ పాటలు...అయితే..అలాంటి పాటే ఈ నేను సైతం ప్రపంచాగ్నికి అనే తెలుగు సినిమా పాట. ఈ పాట ఠాగూర్ చిత్రం లోనిది. సుద్దాల అశోక్ తేజ రచించగా మణిశర్మ స్వరాలు కూర్చారు.
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం భువనఘోషకి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం విశ్వశాంతికి వెర్రిగొంతుకనిచ్చి మ్రోశాను
||నేను సైతం ప్రపంచాగ్నికి||

అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినా ఓ రుద్రుడా
అగ్నిశిఖలని గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
హరశ్వతమును చేతబూనిన పరశురాముని అంశవా
హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆజాదువా
మన్నెంవీరుడు రామరాజు ధను:శ్శంఖారానివా
భగత్ సింగ కడసారి పల్కిన ఇంక్విలాబ్ శబ్దానివా

అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా
ఇప్పటివరకు ఈ పాట మీరు వినకుంటే, ఒక సారి వినండి. శ్రీ.శ్రీ రాసిన మరో పాట ...ఈ పాటకి మాతృక.. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories