బ్రిడ్జి కోసం మురుగు కాలువలో దిగిన ఎమ్మెల్యే

బ్రిడ్జి కోసం మురుగు కాలువలో దిగిన ఎమ్మెల్యే
x
Highlights

ప్రజలు పడుతున్న ఇబ్బందిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్నంగా నిరసన...

ప్రజలు పడుతున్న ఇబ్బందిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. నెల్లూరులో స్థానికంగా చిన్న వంతెన నిర్మించాలని కోరుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో మురుగునీటి కాలువలోకి దిగిపోయారు. అధికారులు ఇక్కడ బ్రిడ్జిని నిర్మించేవరకూ తాను బయటకు రాబోనని స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు.. జేఈ బాలసుబ్రహ్మణ్యాన్ని ఘటనా స్థలికి పంపించారు. పనులను గంట లోపు ప్రారంభిస్తామని.. 45 రోజుల్లోపు బ్రిడ్జి నిర్మిస్తామని ఆయన చెప్పడంతో ఎమ్మెల్యే కాలువలో నుంచి బయటకు వచ్చారు.

Nellore rural MLA K. Sridhar Reddy enters sewage water in protest against the official negligence in constructing a protection wall for the walkway bridge over the drainage at Chanakya puri colony in Nellore city on Wednesday.  (DC)

Show Full Article
Print Article
Next Story
More Stories