మాటలకందని భావాలు మంచి మనసులు చెబుతాయి!

Highlights

కొన్ని పాటలు సాహిత్యంతో పాటు దాని భావం కూడా చాల అందంగా వుంటుంది, అలాంటి పాటే ఈ... మాటలకందని భావాలు.. పల్లవి : మాటలకందని భావాలు మంచి మనసులు చెబుతాయి...

కొన్ని పాటలు సాహిత్యంతో పాటు దాని భావం కూడా చాల అందంగా వుంటుంది, అలాంటి పాటే ఈ... మాటలకందని భావాలు..
పల్లవి :
మాటలకందని భావాలు మంచి మనసులు చెబుతాయి
కవితలకందని భావాలు కంటిపాపలే చెబుతాయి | | మాటలకందని | |

చరణం 1 :
వెన్నెల మాటాడునా వెదజల్లును చల్లదనాలు
మల్లిక మాటాడునా కురిపించును పరిమళాలు. | | వెన్నెల | |
బాసరాని పాపాయి బోసినవ్వు చాలదా
ఏనాడూ పలకని దైవం ఈ లోకములేలదా | | మాటలకందని | |

చరణం 2 :
పిల్లగాలి పరుగులలో వెల్లివిరియు గీతికలు
కొండవాగు తరగలలో కోటి రాగమాలికలు | | పిల్లగాలి | |
హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం | | హృదయానికి | |
కనగలిగిన మనసుంటే బ్రతుకే అనురాగమయం | | మాటలకందని | |
మాటలకందని భావాలు అనే ఈ పాట నీతి నిజాయితి సినిమాలోనిది...ఈ పాటని డా. సి. నారాయణరెడ్డి రచించారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories