వణికిస్తోన్న వేపచెట్టు

x
Highlights

ఆ గ్రామంలో చెట్లన్నీ పచ్చగానే ఉన్నాయి. కానీ విచిత్రంగా వేపచెట్లు మాత్రం ఎండిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు గ్రామంలోని అన్ని వేపచెట్లదీ అదే...

ఆ గ్రామంలో చెట్లన్నీ పచ్చగానే ఉన్నాయి. కానీ విచిత్రంగా వేపచెట్లు మాత్రం ఎండిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు గ్రామంలోని అన్ని వేపచెట్లదీ అదే పరిస్థితి. అయితే ఎందుకు వేపచెట్లు ఎండిపోతున్నాయో తెలియని గ్రామస్తులు తమ గ్రామానికి ఏదో కీడు జరుగుతోందంటూ వణికిపోతున్నారు.

శంషాబాద్‌ మండలం తొండుపల్లి గ్రామం..ఏమైందో ఏమో ఈ గ్రామంలో వేపచెట్లన్నీ ఎండిపోతున్నాయి. కొద్దిరోజులుగా ఒకటి తర్వాత మరొకటి ఇలా వేపచెట్లన్నీ మోడుబారిపోతున్నాయి. మిగతా చెట్లన్నీ పచ్చగానే ఉన్నాయి. కానీ వేపచెట్లు మాత్రమే ఎండిపోతుండటంతో తొండుపల్లి గ్రామస్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల్లో వేపచెట్లు పచ్చగా ఉంటే తొండుపల్లిలో ఎందుకు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. తమ గ్రామానికి ఏదో కీడు జరగబోతోందని వణికిపోతున్నారు.

అయితే బొడ్డురాయి పునప్రతిష్టాపనలో నియమాలు పాటించనందుకే ఈ అనర్ధం జరుగుతోందని గ్రామస్తులు భావిస్తున్నారు. దాంతో నష్టనివారణ పూజలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు.
తొండుపల్లి గ్రామంలో వేపచెట్లు ఎండిపోతుండటంపై గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అసలు కారణమేంటో తెలియదు కానీ పండితుల మాటలు కూడా అక్కడి ప్రజలను భయపెడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories