కొత్త బంగారులోకంలోని లోతు...

arun
By arun
Updated on: 24 Dec 2018 4:34 PM IST
కొత్త బంగారులోకంలోని లోతు...
X

కొత్త బంగారులోకంలోని సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన, బాలు పాడిన పాట ...ఈ నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా.. అనే పాట .. మన జీవితంలోని...కొన్ని సమయాలలోని సందేహాలను స్పర్శిస్తూ వ్రాసిన ఈ పాట...
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అప్పుడో ఇప్పుడు కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదె విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరపడిన పడినా జలిపడదె కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదె నువ్వొచేదాక
అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా
వలపేదో వలవేస్తుంది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలో పడు ప్రతి నావా…చెబుతున్నది వినలేవా
పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా
మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనె పెను చీకటి చెబుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేసాయా చరిత పుటలు వెను చూడక వురికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదె విధి రాత…అనుకోదేం ఎదురీత
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అప్పుడో ఇప్పుడు కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదె విరిసె కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటె అతి సులువా
పొరపడిన పడినా జలిపడదె కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదె నువ్వొచేదాక
ఇప్పటివరకు ఈ పాట వినకుంటే ఒక సారి వినండి, ఒక కాలం, జీవితం యొక్క ఆటని ఈ పాట చాల చక్కగా చెప్పింది అనిపిస్తుంది. శ్రీ.కో.

arun

arun

Next Story