ప్రణయ్ హత్యకేసులో సంచలన విషయాలు....అడ్వాన్స్‌గా 15 లక్షలు రూపాయలు తీసుకున్న....

x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ప్రణ‍య్ హత్య కేసు దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచేస్తున్నాయి. కన్న ప్రేమను సైతం పక్కన బెట్టి అత్యంత పాశవికంగా...

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ప్రణ‍య్ హత్య కేసు దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచేస్తున్నాయి. కన్న ప్రేమను సైతం పక్కన బెట్టి అత్యంత పాశవికంగా ప్రవర్తించిన మారుతి రావు అసలు స్వరూపం నెమ్మదిగా వెలుగు చూస్తోంది. ప్రణయ్ హత్య చేసేందుకు మారుతి రావు పకడ్బందీ ప్లాన్ వేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య వెనక నయీం గ్యాంగ్ హస్తముందని అమృత ఆరోపించినట్టుగానే ... హత్యకు పాల్పడిన నిందితుల్లో నయిం గ్యాంగ్ సభ్యుడిని పోలీసులు గుర్తించారు.

గతంలో నయీంకు ముఖ్య అనుచరుడిగా ఉన్న అబ్దుల్‌ బారీదే ఈ హత్యకు పథక రచన చేసినట్టు పోలీసులు గుర్తించారు. పూర్తి స్ధాయిలో రెక్కి నిర్వహించిన తరువాత 20 రోజుల క్రితం డీల్ కుదిరినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రణయ్‌ని హత్య చేసేందుకు 15 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఈ డబ్బుతోనే షఫీ అనే రౌడీషీటర్‌తో ఒప్పందం కుదుర్చుకుని హత్య చేసినట్టు గుర్తించారు. నయీం ఎన్‌కౌంటర్ అనంతరం హైదరాబాద్ మకాం మార్చిన అబ్దుల్ బారీదే ఇక్కడి నుంచే హత్యకు కుట్ర చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన గుజరాత్ హోంమంత్రి హిరేన్‌ పాండే కేసులో అబ్దుల్ బారీదే జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చారు. దీంతో అమృత తండ్రి మారుతిరావుకు ఉగ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories