'అమ్మ' కాబోతున్న నయనతార..

nanireddy
Updated on: 24 Dec 2018 3:37 PM IST
అమ్మ కాబోతున్న నయనతార..
X

అమ్మ కావడానికి అసలు నయనతారకు ఎప్పుడు పెళ్లైంది.. ఎవరికీ తెలియకుండా ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందా.. ఇప్పుడివే సినీ అభిమానుల మదిలో తొలుస్తున్న డౌట్లు. నిజానికి నయనకు పిల్లలు లేరు.. పెళ్లి అంతకన్నా కాలేదు.. అసలు విషయమేమిటంటే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ‘అమ్మ’గా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి. ఆమెను తమిళులంతా తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. ఆమె దూరమై రెండేళ్లు కావొస్తున్నా తన పేరుతో ఉన్న పథకాలు జనాల మదిలో పదిలంగా ఉన్నాయి. పేదవాడి గుండెల్లో కొలువైన 'అమ్మ'ను ప్రేక్షకులముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు తమిళ దర్శకులు. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఆమె బయోపిక్ తెరకెక్కనుంది. ఇక జయలలిత పాత్రకోసం నయనతార పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ సినిమాలో నయన్ ఒకే అయితే అందరికి ఆమె 'అమ్మ' అవుతుంది అని అభిప్రాయపడుతున్నారు.

nanireddy

nanireddy

Next Story