మోడీతో.. చంద్రబాబు వైరం ఇప్పటిది కాదట!

మోడీతో.. చంద్రబాబు వైరం ఇప్పటిది కాదట!
x
Highlights

నరేంద్రమోడీ.. చంద్రబాబు. ఈ ఇద్దరికీ ఇప్పటి నుంచి కాదు. 2002 లో గుజరాత్ అల్లర్లు జరిగినప్పటి నుంచి అంతర్యుద్ధం నడుస్తూనే ఉంది. అప్పుడు గుజరాత్ లో...

నరేంద్రమోడీ.. చంద్రబాబు. ఈ ఇద్దరికీ ఇప్పటి నుంచి కాదు. 2002 లో గుజరాత్ అల్లర్లు జరిగినప్పటి నుంచి అంతర్యుద్ధం నడుస్తూనే ఉంది. అప్పుడు గుజరాత్ లో జరిగిన అల్లర్ల సందర్భంగా.. మోడీని ఆ రాష్ట్ర సీఎం పదవి నుంచి తప్పించాలని వాదించిన మొదటి నాయకుడు చంద్రబాబు. కానీ.. అద్వానీ వంటి సీనియర్ నాయకుడి అండతో.. మోడీ అప్పుడు సేఫ్ గా బయటపడ్డారు.

ఓ దశలో.. నాటి ప్రధాని వాజ్ పేయి కూడా.. మోడీపై కఠిన చర్యలు తీసుకోవాలని భావించినా.. అద్వానీ ఒత్తిడితోనే వాజ్ పేయి కూడా వెనక్కి తగ్గినట్టుగా ఓ కథనం ప్రచారంలో ఉంది. ఆ తర్వాత.. 2003లో కూడా గణేష్ నిమజ్జనం సందర్భంగా.. మోడీ హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నించినా కూడా.. చంద్రబాబు అడ్డుకున్నట్టుగా మరో కథనం ప్రచారంలో ఉంది.

ఈ రెండు విషయాలను మోడీ మనసులో పెట్టుకునే.. 2014 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబును సతాయిస్తున్నారని.. మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని.. ఏపీకి నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర చట్టాలను సాకుగా చూపెడుతూ.. విభజన చట్టం హామీలను కూడా మోడీ యథేచ్ఛగా తుంగలో తొక్కేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు.. కేంద్రం నుంచి పూర్తిగా టీడీపీ బయటికి రావడాన్ని మోడీ లైట్ తీసుకోవడం వెనక.. ఇదే గొడవ కారణమై ఉంటుందని అంతా కచ్చితమైన భావాలను వెలిబుచ్చుతున్నారు. ఈ గొడవ ఇంకెంత దూరం వెళ్తుందో మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories