మోత్కుపల్లి వ్యాఖ్యలపై స్పందించిన లోకేష్‌

మోత్కుపల్లి వ్యాఖ్యలపై స్పందించిన లోకేష్‌
x
Highlights

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఆయన...

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని అన్నారు. నర్సింహులు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ ప్రాభవాన్ని కోల్పోతోందని అందరూ అంటున్నారని, ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబు ఎన్‌టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు హైదరాబాద్‌ రాలేదని మోత్కుపల్లి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన నారా లోకేష్‌.. కలెక్టర్లతో సమావేశం ఉన్నందు వల్లే ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రాలేకపోయారని చెప్పారు. విజయవాడలో ఎన్‌టీఆర్‌కు ముఖ్యమంత్రి నివాళులు అర్పించినట్లు తెలిపారు. ఎవరైనా పార్టీ విధానాలుకు కట్టుబడి ఉండాల్సిందేనన్న లోకేశ్‌ పొత్తుల సంగతి పార్టీ చూసుకుంటుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories