ముందస్తు ఎన్నికలకు వెళ్లం: నారా లోకేశ్

ముందస్తు ఎన్నికలకు వెళ్లం: నారా లోకేశ్
x
Highlights

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి తాను సిద్ధమన్నారు మంత్రి నారా లోకేశ్. మీడియాతో చిట్‌చాట్ చేసిన లోకేశ్... ముందస్తు ఎన్నికలను రాష్ట్ర ప్రజలు కోరుకోవడం...

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి తాను సిద్ధమన్నారు మంత్రి నారా లోకేశ్. మీడియాతో చిట్‌చాట్ చేసిన లోకేశ్... ముందస్తు ఎన్నికలను రాష్ట్ర ప్రజలు కోరుకోవడం లేదని, టీడీపీ ఐదేళ్ల పాలననే కోరుకుంటున్నారని చెప్పారు. మోడీ హామీలు అమలు చేయకపోవడంపై టీడీపీ చిత్తశుద్ధితో పోరాడుతుందని చెప్పారు లోకేశ్. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే లోపల వేస్తామని హెచ్చరించారు. సైబర్ చట్టం ప్రకారం వ్యవహరిస్తామన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేసే వారు ఆధారాలతో రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దన్నారు. ఐటీ రంగంలో 2లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
వైఎస్ హయాంలో కుప్పానికి మీటర్ రోడ్డు కూడా వేయలేదని ఆరోపించారు. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం పులివెందులకు రోడ్డు వేసినట్లు తెలిపారు. వచ్చే కేబినెట్‌లో నిరుద్యోగ భృతిపై తుది రూపం ఇస్తామని వెల్లడించారు. అలాగే విధివిధానాలు కూడా ప్రకటిస్తామని
లోకేశ్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories