జగన్‌, పవన్‌లకు మంత్రి లోకేష్ సవాల్

nanireddy
Updated on: 24 Dec 2018 3:33 PM IST
జగన్‌, పవన్‌లకు మంత్రి లోకేష్ సవాల్
X

ప్రతిపక్ష నేత జగన్‌ తనపై కేసులు పెట్టుకుని టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి లోకేష్. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని , ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని ఆయన చెప్పారు. పవన్‌, జగన్‌ టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే ఆరోపణలు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. లక్ష కోట్లు దోచేసి జైలుకెళ్లిన వ్యక్తి జగన్ అని, అలాంటి వ్యక్తి తమపై ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. సాయం చేసే అలవాటు లేని జగన్‌, పవన్‌.. చంద్రబాబును విమర్శిస్తారా? అంటూ మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

nanireddy

nanireddy

Next Story