ఓటు వేసిన సుహాసిని.. పరిశీలించేందుకు వెళ్ళీ..

nanireddy
Updated on: 24 Dec 2018 4:27 PM IST
ఓటు వేసిన సుహాసిని.. పరిశీలించేందుకు వెళ్ళీ..
X

కూకట్‌పల్లి ప్రజాకూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న నందమూరి హరికృష్ణ తనయురాలు సుహాసిని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెహిదీపట్నంలోని పోలింగ్ బూత్ లో ఆమె ఓటేశారు. ఆ తర్వాత తను పోటీ చేస్తున్న కూకట్‌పల్లి నియోజకవర్గంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలో కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. రంగారెడ్డి పుప్పులగూడ బాలాజీ నగర్‌లో బీజేపీ మహాకూటమి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదాశివపేట పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింత ప్రభాకర్‌ ఓటు వేశారు. ప్రశాసన్‌ నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఓటు వేశారు.

nanireddy

nanireddy

Next Story