ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం విచారకరం : బాలకృష్ణ

nanireddy
Updated on: 24 Dec 2018 4:22 PM IST
ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం విచారకరం : బాలకృష్ణ
X

తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్‌ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తెలంగాణ మహా సంగ్రామంలో ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని బాలకృష్ణ మండిపడ్డారు. మహిళలకు ఎన్టీఆర్ సముచిత స్థానం కల్పించారని, పద్మావతి యూనివర్శిటీ నెలకొల్పడంతోపాటు ఆస్తి హక్కులో సమాన హక్కు, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ సర్కార్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం విచారకరమన్నారు.. అలాగే సనత్ నగర్ మహాకూటమి టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్ కు మద్దతుగా బాలకృష్ణ రోడ్ షో నిర్వహించారు. సనత్ నగర్ నుండి మొదలైన యాత్ర సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వరకు సాగింది. దారి పొడవునా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

nanireddy

nanireddy

Next Story