రాజకీయాల్లోకి మరో నందమూరి వారసురాలు..?

రాజకీయాల్లోకి మరో నందమూరి వారసురాలు..?
x
Highlights

రాజకీయాల్లోకి మరో నందమూరి వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్‌పల్లి స్థానంలో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థిపై...

రాజకీయాల్లోకి మరో నందమూరి వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్‌పల్లి స్థానంలో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థిపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. నందమూరి హరికృష్ణ కుమార్తె.. సుహాసినిని నిలబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విశాఖ నోవాటెల్‌లో సుహాసిని.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కూకట్‌పల్లిలో పోటీ చేసేందుకు ఆమె కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం కూకట్‌పల్లి అభ్యర్థిని చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories