నాగం జనార్ధన్‌రెడ్డి కుమారుడు మృతి

nanireddy
Updated on: 24 Dec 2018 3:26 PM IST
నాగం జనార్ధన్‌రెడ్డి కుమారుడు మృతి
X

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది. అయన పెద్ద కుమారుడు నాగం దినకర్‌రెడ్డి (46) మృతిచెందారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన వారం రోజుల కిందటే అపోలో ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేసేందుకు వైద్యులు ఓ వైపు ఏర్పాట్లు చేస్తుండగానే ఆస్పత్రిలో గుండెపోటుతో చనిపోయారు. జనార్దన్‌రెడ్డికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకైన దినకర్‌రెడ్డి వైద్యవృత్తిలో కొనసాగుతూనే సివిల్‌ కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డారు. కుమారుడి మృతితో నాగం తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు నాగంను పరామర్శించారు.

nanireddy

nanireddy

Next Story