నాదెండ్ల మనోహర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి..

nanireddy
Updated on: 24 Dec 2018 4:07 PM IST
నాదెండ్ల మనోహర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి..
X

జనసేన కీలకనేత నాదెండ్ల మనోహర్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. అయితే, మనోహర్‌కు ఎటువంటి గాయం కాలేదు. ఈ నెల 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాదెండ్ల మనోహర్ మాదాపూర్ నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లో హెరిటేజ్ వద్ద కారు టర్న్ తీసుకుంటుండగా, వెనక నుంచి వచ్చిన లారీ మనోహర్ కారును ఢీకొట్టింది. మనోహర్ కారు డ్రైవర్ రాజు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

nanireddy

nanireddy

Next Story