నేడు జనసేనలోకి నాదెండ్ల మనోహర్..

నేడు జనసేనలోకి నాదెండ్ల మనోహర్..
x
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈరోజు జనసేన పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మనోహర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈరోజు జనసేన పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మనోహర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి తిరుమల వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.
కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మనోహర్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పార్టీ బలోపేతం అయ్యేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్న సమయంలో మనోహర్ పార్టీని వీడటం కాంగ్రెస్‌‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది.

కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మనోహర్ టీడీపీలోకి వెళతారని ముందుగా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తల్ని మనోహర్ ఖండించారు. కొద్దిరోజులుగా అనుచరులతో సమావేశమవుతున్న ఆయన జనసేన పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించారు. ఏపీలో పార్టీ బలోపేతం అయ్యేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్న సమయంలో మనోహర్ పార్టీని వీడటం కాంగ్రెస్‌‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది.

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడైన మనోహర్ రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టారు. 2004, 2009లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. 2011లో స్పీకర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. స్పీకర్‌గా ఎన్నికకాకముందు ఆయన డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో, అసెంబ్లీ కమిటీల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. ప్రత్యేక హోదాపై ఉద్యమించడం ద్వారా ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో మనోహర్ వంటి నేత పార్టీని వీడటాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories