నాలో నేనేనా! భావ భాణం

నాలో నేనేనా! భావ భాణం
x
Highlights

కొన్ని పాటలు చాల భావాన్ని, అర్ధాన్ని కలిగి వుంటాయి, దాని లోతు చాల అర్ధవంతంగా కూడా వుంటాయి. అలాంటి పాటే...ఈ నాలో నేనేనా.. నాలో నేనేనా ఏదో అన్నానా నాతో...

కొన్ని పాటలు చాల భావాన్ని, అర్ధాన్ని కలిగి వుంటాయి, దాని లోతు చాల అర్ధవంతంగా కూడా వుంటాయి. అలాంటి పాటే...ఈ నాలో నేనేనా..
నాలో నేనేనా
ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపున
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా ||నాలో ||
అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాది మాటే నీది
ఇదేం మాయో
నాలో నేనేనా
ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపున
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా
అవును కాదు తడబాటుని
అంతో ఇంతో గడి దాటనీ
విడి విడిపోని పరదాని
పలుకై రాని ప్రాణాన్ని
యెదంతా పదాల్లోన పలికేన
నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాది మాటే నీది
ఇదేం మాయో ||నాలో ||
దైవం వరమై దొరికిందనీ
నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హృదయాన్ని
చిగురైపోని శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు
నూరేళ్ళుగా యెదిగి పోయాయిలా
మనమే సాక్ష్యం
మాటే మంత్రం
ప్రేమే బంధం ||నాలో ||
ఒక సారి ఈ పాట వింటే దీని మాధుర్యం మీరు అభినందిస్తారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories