‘నా నువ్వే’ మూవీ రివ్యూ

సమర్పణ: మహేశ్ కోనేరు నిర్మాణ సంస్థ: కూల్ బ్రీజ్ సినిమాస్ తారాగణం: నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా,...
సమర్పణ: మహేశ్ కోనేరు
నిర్మాణ సంస్థ: కూల్ బ్రీజ్ సినిమాస్
తారాగణం: నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా, పోసాని కృష్ణమురళి, వెన్నెలకిశోర్, తనికెళ్లభరణి, సురేఖా వాణి తదితరులు
సంగీతం: శరత్
సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్
కూర్పు: టి.ఎస్.సురేశ్
కథ, స్క్రీన్‌ప్లే: జయేంద్ర శుభ
నిర్మాతలు: కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి
దర్శకత్వం: జయేంద్ర
నందమూరి కళ్యాణ్ రామ్ మొదటినుండి కూడా మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేశారు. అటువంటి హీరో తొలిసారిగా 'నా నువ్వే' చిత్రంలో లవర్ బాయ్ అవతారంలో కనిపించడానికి రెడీ అయ్యాడు. అతడికి జోడీగా తమన్నా కనిపించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కళ్యాణ్ రామ్, తమన్నా ఓ లవ్ స్టోరీ అంటే ఎక్కడో ఓ చిన్న సందేహం కూడా ఉంది. మరి వీటికి ఈ సినిమా ఎలాంటి సమాధానం చెప్పిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ: మీరా(తమన్నా) రెడియో జాకీ. ప్రేమికుల రోజు సందర్భంగా 36 గంటల రేడియో మారథాన్ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేస్తుంది. అందులో తన ప్రేమ కథను చెప్పడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. వరుణ్(నందమూరి కల్యాణ్‌రామ్) పి.హెచ్.డి చేసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. అతని స్నేహితులు(వెన్నెల కిశోర్, ప్రవీణ్) కూడా అతనితోనే ఉంటారు. అయితే ఎయిర్‌పోర్టు చేరుకున్న ప్రతిసారి వరుణ్ ఏదో ఒక కారణంతో ఫ్లైట్ మిస్ చేసుకుంటూ ఉంటాడు. వరుణ్ బామ్మ కల్యాణి తనకు పెళ్లి చేయాలని లవ్ సైన్ పుస్తకం కొంటుంది. ఓ సందర్భంలో దాన్ని వరుణ్ చదవడానికని తీసుకుంటాడు. ఆ పుస్తకాన్ని ట్రెయిన్‌లోనే మరచిపోతాడు. అది అనుకోకుండా మీరాకి దొరుకుతుంది. మీరా కూడా ఆ పుస్తకాన్ని ఇంకేవరికో ఇచ్చేసినా కూడా అది మీరా దగ్గరికి మళ్లీ చేరుకుంటుంది. అసలే విధిని బలంగా నమ్మే మీరా.. తనకు, ఆ పుస్తకంతో ఏదో రిలేషన్ ఉందని నమ్ముతుంది. ఆ పుస్తకం ఓపెన్ చేయగానే అందులో వరుణ్ ఫోటోను చూస్తుంది. వరుణ్‌ని చూడగానే తను అప్పటి వరకు పాస్ కానీ ఎగ్జామ్స్ పాస్ అయిపోవడం సహా కొన్ని పనులు జరిగిపోతాయి. దాంతో వరునే తన లక్కీ అని మీరా బలంగా నమ్మి అతనితో ప్రేమలో పడుతుంది. సిటీలో అతన్ని చూసిన ప్రతిసారి కలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. వరుణ్ కూడా మిస్ అవుతుంటాడు. ఓసందర్భంలో వరుణ్‌ని కలుసుకుని తనకు జరిగిన అనుభవాలు చెప్పి ప్రేమను వ్యక్తపరుస్తుంది. అయితే వరుణ్.. మీరాకు ఓ పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏంటి? మీరా అందులో నెగ్గుతుందా? ఇద్దరు కలుసుకుంటారా? అసలు ఇద్దరి మధ్య గొడవలేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ ; కల్యాణ్ రామ్ లాంటి మాస్ హీరోతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెరకెక్కించిన దర్శకుడు జయేంద్ర అనుకున్న స్థాయిలో అలరించలేకపోయాడు. డెస్టినీ చుట్టూ రాసుకున్న కథలో ఎమోషన్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. విడిపోయిన హీరోయిన్లు ఎలా కలుస్తారన్న క్యూరియాసిటీ కలిగించినా.. ప్రేక్షకుడు కథలో లీనమయ్యే స్థాయి ఎమోషనల్ సీన్స్ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌లకు కామెడీ కూడా కీలకం. అయితే దర్శకుడు ఎక్కడా కామెడీ మీద దృష్టి పెట్టలేదు. వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రియదర్శి లాంటి కమెడియన్స్ ఉన్నా వారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. శరత్ సంగీతమందించిన పాటలు పరవాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. యాడ్ ఫిలిం మేకర్ అయిన జయేంద్ర పాటలను యాడ్ ఫిలింస్ లా గ్రాఫిక్స్ నేపథ్యంలో ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రయత్నం కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. పీసీ శ్రీరాం లాంటి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఉన్నా.. ఆయన మ్యాజిక్ కూడా ఎక్కడా కనిపించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పూర్తి క్లాస్ సినిమా కావటంతో ఓ సెక్షన్ ఆడియన్స్ ను అలరించినా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.
నటీనటులు ; ఇన్నాళ్లు మాస్ యాక్షన్ రోల్స్ లో కనిపించి కల్యాణ్ రామ్ సాఫ్ట్, స్టైలిష్ లుక్ లో మెప్పించాడు. నటన పరంగానూ ఆకట్టుకున్నాడు. మీరా పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. గ్లామర్ షోతో కుర్రకారును ఫిదా చేసిన తమన్నా నటనలోనూ ఫుల్ మార్క్స్ సాధించింది. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ తమన్నా నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పోసాని కృష్ణమురళీ తెర మీద కనిపించింది తక్కువ సేపే అయిన ఉన్నంతలో తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. హీరోయిన్ తండ్రి తనికెళ్ల భరణీ తనకు అలవాటైన రొటీన్ పాత్రలో కనిపించారు. ప్రవీణ్, వెన్నెల కిశోర్, సురేఖ వాణి, ప్రియదర్శి తమ పాత్రలకు న్యాయం చేశారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT