బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన పారిశుద్ధ్య కార్మికులు

బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన పారిశుద్ధ్య కార్మికులు
x
Highlights

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పారిశుద్ధ్య కార్మికుల నుంచి నిరసన సెగ తాకింది. జీవో నెంబర్ 279ను రద్దు చేయాలంటూ హిందూపురంలో బాలయ్య...

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పారిశుద్ధ్య కార్మికుల నుంచి నిరసన సెగ తాకింది. జీవో నెంబర్ 279ను రద్దు చేయాలంటూ హిందూపురంలో బాలయ్య ఇంటిని ముట్టడించి.. ఇంటి ముందు చెత్త వేసి ఆందోళన చేపట్టారు. నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చెత్త వేసి వారు తమ నిరసన తెలిపారు. బాలకృష్ణ ఇంటిని కార్మికులు ముట్టడించడంతో పోలీసులు వారిని అడ్డుకొని ఈడ్చి పడేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories