క్రికెట్ కు ఇక సెలవు..

nanireddy
Updated on: 24 Dec 2018 3:57 PM IST
క్రికెట్ కు ఇక సెలవు..
X

ఒకప్పటి భారత పేస్‌బౌలర్‌ మునాఫ్‌ పటేల్‌(35) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశాడు మునాఫ్.. 'ఇప్పటి వరకు చాలామందితో కలిసి ఆడాను. వారిలో ధోని తప్ప దాదాపు అందరూ తప్పుకున్నారు. మిగతావారు ఆడుతూ నేను రిటైర్మెంట్‌ ప్రకటిస్తే ఎక్కువ బాధ ఉండేది. ఇక వైదొలగాల్సిన సమయం వచ్చేసింది' అని ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా 2006లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతను మొత్తం 13 టెస్టుల్లో 35 వికెట్లు... 70 వన్డేల్లో 86 వికెట్లు... 3 టి20ల్లో 4 వికెట్లు తీశాడు. దాదాపు ఆరేళ్లుగా వివిధ కారణాలతో జట్టుకు దూరంగా ఉంటున్నారు. 2011 వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన మునాఫ్‌ ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

nanireddy

nanireddy

Next Story