ఇద్దరు బాలికలు సెల్ఫీ దిగి.. అనంతరం బావిలో దూకి ఆత్మహత్య

nanireddy
Updated on: 24 Dec 2018 4:10 PM IST
ఇద్దరు బాలికలు సెల్ఫీ దిగి.. అనంతరం బావిలో దూకి ఆత్మహత్య
X

ఇద్దరు బాలికలు సెల్ఫీ దిగి, అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ముంబయిలో జరిగింది. ముంబయి ఆరీ కాలనీకి చెందిన సునీత, ప్రవీణలు ఇద్దరు స్నేహితులు. సునీత ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. ప్రవీణల పదవతరగతి మధ్యలోనే ఆపేసి పనికి వెళుతోంది. అయితే వీరిద్దరూ మంగళవారం రాత్రి అదే ప్రాంతానికి సమీపంలోని నీటిభావి వద్దకు వెళ్లి సెల్ఫీ దిగారు. అనంతరం ఆ బావిలోనే దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.

nanireddy

nanireddy

Next Story