ఎంపీ అసదుద్దీన్ ఒవైసీయే ఇప్పుడు ముఖేష్ రాజకీయ భవిష్యత్ నిర్ణయించబోతున్నారా.?

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీయే ఇప్పుడు ముఖేష్ రాజకీయ భవిష్యత్ నిర్ణయించబోతున్నారా.?
x
Highlights

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్‌‌ను వీడతారా.? పుట్టినరోజు వేడుకల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖేష్ పార్టీని వీడకుండా పీసీసీ చీఫ్ ఎలాంటి...

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్‌‌ను వీడతారా.? పుట్టినరోజు వేడుకల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖేష్ పార్టీని వీడకుండా పీసీసీ చీఫ్ ఎలాంటి చర్యలు చేపట్టారు.? ఉత్తమ్ బుజ్జగింపుతో ముఖేష్ వెనక్కి తగ్గుతారా.? ఎంపీ అసదుద్దీన్ ఒవైసీయే ఇప్పుడు ముఖేష్ రాజకీయ భవిష్యత్ నిర్ణయించబోతున్నారా.?

మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆ పార్టీకి గట్టి దెబ్బే పడింది. ఇప్పుడు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా పార్టీ వీడి గులాబీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతుండటంతో పీసీసీ నేతల్లో కలవరం మొదలైంది. ఆదివారం ముఖేష్ గౌడ్ పుట్టిన రోజు కావడంతో ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఆయన భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి అధికార టీఆర్ఎస్ ప్రతినిధులతో పాటు మిగతా పార్టీల నేతలు హాజరవుతారనే చర్చ జరుగుతోంది. దానం విషయంలో జరిగిన ఆలస్యం ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ అంశంలో జరగకుండా పీసీసీ చీఫ్ ఉత్తమ్ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్‌తో ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్‌లో సమావేశమై చర్చించారు. పార్టీ తీరు తమకు దక్కుతున్న గౌరవంపై విక్రమ్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఉత్తమ్ సైలెంట్ అయిపోయారు. ముఖేష్ గౌడ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆయనతోనే డైరెక్ట్‌గా ఉత్తమ్ చర్చలు జరిపే చాన్స్ ఉంది.

టీపీసీసీ బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నా ముఖేష్ గౌడ్ కుటుంబం మాత్రం అధికార టీఆర్ఎస్ వైపు అడుగులు వేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. కానీ వీరి రాజకీయ భవిష్యత్ మాత్రం మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీనే డిసైడ్ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసద్ గైడెన్స్‌ను బట్టే ముఖేష్ గౌడ్ కుటుంబం ఏ పార్టీ వైపు అడుగులు వేస్తుందన్నది డిసైడ్ అవుతుందని చెప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories