అధికార పార్టీ ఎంపీపీ దౌర్జన్యం

అధికార పార్టీ ఎంపీపీ దౌర్జన్యం
x
Highlights

స్థలం విక్రయం విషయంలో వివాదం తలెత్తింది. అధికారం ఉందన్న అహంతో అమ్మిన ఇంటిని ఖాళీ చేయకుండా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఎదిరించినందుకు రెచ్చిపోయాడు....

స్థలం విక్రయం విషయంలో వివాదం తలెత్తింది. అధికారం ఉందన్న అహంతో అమ్మిన ఇంటిని ఖాళీ చేయకుండా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఎదిరించినందుకు రెచ్చిపోయాడు. మహిళ అని కూడా చూడకుండా కాలితో గుండెలపై తన్నాడు. అప్రమత్తమైన ఆమె బంధువులు ఆ ప్రజాప్రతినిధిని తోసిపడేశారు. నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఆ నేత వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండలం ఇందల్వాయిలో ఓ ఎంపీపీ అరాచాకం ఇది.... స్థలం విక్రయం విషయంలో ఓ కుటుంబానికి, ఎంపీపీకి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రిజిస్ట్రేషన్ చేయాలంటే అదనపు డబ్బులు ఇవ్వాలనడంతో బాధితురాలు ఎంపీపీ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. దీంతో వాగ్వాదం జరిగి... మహిళ ఎంపీపీని చెప్పుతో కొట్టింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఎంపీపీ.. అందరూ చూస్తుండగానే బాధిత మహిళ గుండెలపై కాలితో తన్నాడు.

ఎంపీపీ ఇమ్మడి గోపి నుంచి 1125 గజాల స్థలాన్ని రాజవ్వ కొనుగోలు చేసింది. కొన్న స్థలానికి ఏడాది క్రితం 33 లక్షల 72 వేలు చెల్లించింది. అయితే, స్థలం రిజిస్ట్రేషన్‌ తర్వాత ఎంపీపీ గోపీ అదనంగా డబ్బులు అడిగాడని బాధితురాలైన గౌరారం వాసి రాజవ్వ చెబుతోంది. 96లక్షలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని ఎంపీపీ చెప్పడంతో ఆమె తమ బంధువులతో కలిసి ఎంపీపీ ఇంటి ముందు నిరసనకు దిగింది. రాజవ్వ కొన్న ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆ తాళం బద్దలు కొట్టి ఇంటిలోని సామాగ్రిని బయటపడేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎంపీపీ ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే ఆవేశానికి లోనైన రాజవ్వ ఎంపీపీని చెప్పుతో కొట్టింది. వెంటనే ఎంపీపీ ఆమెను కాలితో తన్నాడు.

తాను మాజీ నక్సలైట్‌నని, నాతో పెట్టుకోవద్దని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. అయితే పోలీసులు, కలెక్టర్ దగ్గరకు వెళ్తే ఆ ఇల్లు మీకే దక్కుతుంది వెళ్లమని భరోసా ఇచ్చారని బాధితురాలు అంటోంది. తన బిడ్డలకు ఏమైనా జరిగితే ఎంపీపీ గోపీదే బాధ్యతని చెబుతోంది.

ఎంపీపీ రాజవ్వకు ఇల్లు అమ్మిన విషయం వాస్తవమేనని పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా రాజవ్వను ఎంపీపీ బెదిరించాడని ఆ మేరకు రాజవ్వ ఫిర్యాదు కూడా చేసిందని ఆయనపై కేసు నమోదైందని పోలీసులు చెబుతున్నారు. అయితే, సివిల్ మేటర్ కావడంతో కోర్టులో తేల్చుకోమని సూచించినట్టు తెలిపారు. ఇప్పుడు ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అధికార పార్టీకి చెందిన ఎంపీపీ ఓ మహిళ పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories