అన్నా మోదీగారు ఎక్కడుంటారు..?

x
Highlights

ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో టీడీపీ, వైసీపీ ఎంపీలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. బుధవారం ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం...

ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో టీడీపీ, వైసీపీ ఎంపీలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. బుధవారం ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ, వైసీపీ ఎంపీలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. విభజన హామీలు అమలు చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ వినూత్న నిరసన చేపట్టారు. రైతు వేషధారణలో పార్లమెంటుకు వచ్చిన ఆయన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు పలకరించారు. మోదీ గారు ఎక్కడుంటారండీ.. అంటూ ఆయన పలువురు ఎంపీలను అమాయకంగా అడుగుతూ నిరసన తెలిపారు. అమరావతి శంకుస్థాపన వచ్చిన ప్రధాని మట్టి, నీరు ఇచ్చారని.. ఇప్పడవి ఆయనకే తిరిగిచ్చేస్తామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories