logo
ఆంధ్రప్రదేశ్

ఎంపి శివప్రసాద్‌ వినూత్న నిరసన

ఎంపి శివప్రసాద్‌ వినూత్న నిరసన
X
Highlights

తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్‌ తిరుపతిలోని తారకరామా స్టేడియంలో చెవిలో...

తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్‌ తిరుపతిలోని తారకరామా స్టేడియంలో చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడి తారకరామా స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఏపీకి ఆయా హామీలు ఇచ్చారు. కాగా... గత హామీలను గుర్తు చేస్తూ మోదీ పాల్గొన్న స్టేడియంలో ఎంపీ శివప్రసాద్‌ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఏపీకి నరేంద్రమోదీ హామీలు ఇచ్చి పట్టించుకోవడం లేదన్నారు. హామీలు అమలు చేయకపోతే పుట్టగతులు ఉండవని ఎంపి అన్నారు.

Next Story