గాలి జనార్ధన్‌రెడ్డి కోసం జగన్ వెన్నుపోటు పొడిచారు: రాయపాటి

గాలి జనార్ధన్‌రెడ్డి కోసం జగన్ వెన్నుపోటు పొడిచారు: రాయపాటి
x
Highlights

బీజేపీ, వైసీపీ జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే అని ఎంపీ రాయపాట సాంబశివరావు అన్నారు. అన్న గాలి జనార్థన్‌రెడ్డి కోసం సొంత జిల్లాకు వెన్నుపోటు పొడిచిన...

బీజేపీ, వైసీపీ జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే అని ఎంపీ రాయపాట సాంబశివరావు అన్నారు. అన్న గాలి జనార్థన్‌రెడ్డి కోసం సొంత జిల్లాకు వెన్నుపోటు పొడిచిన తమ్ముడు జగన్ అని దుయ్యబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్న గాలి జనార్ధన్‌రెడ్డి కోసం తమ్ముడు జగన్‌ సొంత జిల్లాకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. బీజేపీ, వైసీపీలు క్విడ్‌ ప్రో కోకు కేరాఫ్‌ అడ్రస్ అని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్ధన్‌రెడ్డి అందించిన ఆర్థికసాయానికి కడప స్టీల్‌ప్లాంట్‌ను బహుమానంగా ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. విభజన హామీలపై బీజేపీ నేతలు ప్రజాక్షేత్రంలో మాట్లాడాలని రాయపాటి డిమాండ్ చేశారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ 5 కోట్ల మంది ఆంధ్రులను నిలువునా వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగులో బ్రహ్మణి స్టీల్స్‌ నిర్మించడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ గాలి జనార్థన్‌రెడ్డి పెట్టిన బహిరంగ విలేకర్ల సమావేశమే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories