ఈనెల 23న కాంగ్రెస్ లోకి కొండా.. మరో ఇద్దరు చేరతారంటూ..

nanireddy
Updated on: 24 Dec 2018 4:08 PM IST
ఈనెల 23న కాంగ్రెస్ లోకి కొండా.. మరో ఇద్దరు చేరతారంటూ..
X

టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 23న సోనియాగాంధీ సమక్షంలో మేడ్చల్‌లో జరిగే బహిరంగసభలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. కొంతకాలంగా కొండా టీఆర్‌ఎస్‌ ను వీడతారన్న వార్తలు వస్తున్నాయి. నిన్న(మంగళవారం) ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే టీఆర్ఎస్ కు ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందో ఒక లేక రూపంలో వివరించారు. అయితే కొండా సరైన సమయం కోసం వేచిచూశారని, అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుంటే మరో ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బాంబ్ పేల్చారు. దాంతో తెరాస అధిష్టానం అప్రమత్తమైంది.

nanireddy

nanireddy

Next Story